paruchuri: అన్నగారికి మాపై వున్న నమ్మకం అలాంటిది: పరుచూరి గోపాలకృష్ణ

  • అది ఎన్టీఆర్ పై జయసుధ కోప్పడే సీన్
  • దర్శక నిర్మాతలు కంగారుపడిపోయారు
  • అన్నగారు ఫరవాలేదు కానివ్వమన్నారు

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, దర్శకుడు కె.బాపయ్యతో తమకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. ఆయనతో కలిసి తాము చేసిన 'నా దేశం' సినిమాను గురించి చెప్పుకొచ్చారు. "హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోలో 'నా దేశం' షూటింగు జరుగుతోంది. జయసుధ కోపంతో ఎన్టీ రామారావుగారితో మాట్లాడుతుండటం చిత్రీకరిస్తున్నారు.

అప్పుడు దర్శకులు బాపయ్య .. నిర్మాత దేవీవరప్రసాద్ కంగారుపడిపోయి 'డైలాగులు మరీ టూమచ్ గా వున్నాయి' అన్నారు. ఎన్టీ రామారావుగారు వాళ్లని వారిస్తూ 'పరుచూరి బ్రదర్స్ దీనికి కౌంటర్ ఎక్కడో రాసే వుంటారు .. మీరు కానివ్వండి మేము చెబుతాము' అన్నారు. ఆ తరువాత రామారావుగారు జయసుధను తిట్టే సీన్ ఒకటి వస్తుంది.

అప్పుడు రామారావుగారు బాపయ్య .. దేవీవరప్రసాద్ లతో 'చూశారా .. ఈ డైలాగులు మేము ఇక్కడ చెప్పాలంటే .. ఆ డైలాగులు అక్కడ ఆమె చెప్పాలి కదా .. అక్కడ ఆమె అలా మాట్లాడి ఉండకపోతే .. ఇక్కడ ఒక స్త్రీని మేము దూషించినట్టుగా అనిపించేది' అన్నారు. మా మీద అన్నగారికి గల నమ్మకానికి ఆనందమేసింది. బాపయ్య గారు ఈ సినిమా మాకు ఇవ్వడం వల్లనే మాకు ఇంతటి అదృష్టం లభించింది" అని చెప్పుకొచ్చారు.   

More Telugu News