paruchuri: 'ముందడుగు' ఫైనల్ వెర్షన్ ఆ దర్శకుడికి నచ్చలేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • ఆ దర్శకుడు మమ్మల్ని ప్రోత్సహించాడు 
  • రామానాయుడుగారిని పరిచయం చేశాడు 
  • మాకు మల్టీ స్టారర్ హిట్ దక్కేలా చేశాడు 

ఎన్నో సినిమాలకి కథలను .. మాటలను అందించిన అనుభవం పరుచూరి గోపాలకృష్ణకి వుంది. తాజాగా ఆయన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో దర్శకుడు కె.బాపయ్యను గురించి ప్రస్తావించారు. "దర్శకుడు పి.సి.రెడ్డి గారు .. కృష్ణగారు మా రచనా జీవితానికి మేము సైతం అంటూ ఎలా సాయపడ్డారో, అలా మాకు సాయపడిన మరో దర్శకుడు కె. బాపయ్యగారు. ఆయన నేరుగా మమ్మల్ని తీసుకెళ్లి రామానాయుడు గారికి పరిచయం చేశారు. మా గురించి వినగానే నాయుడుగారు అయిదువేల రూపాయలను అడ్వాన్స్ గా ఇచ్చారు.

'మీరు పెద్ద సినిమాలు రాయదగిన సమర్థులు" అంటూ మమ్మల్ని ప్రోత్సహించిన బాపయ్యగారు, ఆ తరువాత మాతో 'ముందడుగు' రాయించారు. అయితే ఆయనకి  ఫైనల్ వెర్షన్ నచ్చలేదు. ఆయన ఎక్కువసార్లు ఆ కథను వినడం వలన అలా అనిపించి ఉంటుందని అనుకుని, రామానాయుడు గారికి వినిపించాము. ఆయన ఓకే చెప్పడంతో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా పాతిక వారాలు ఆడేసింది. అలా మా కాంబినేషన్లో వచ్చిన మల్టీ స్టారర్ సూపర్ హిట్ అయింది" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News