Andhra Pradesh: చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ నాందేడ్ ఎస్పీ లేఖ.. కోర్టు వారెంట్ ఏదన్న ఏపీ డీజీపీ!

  • ఎనిమిదేళ్ల నాటి కేసులో చంద్రబాబుకు వారెంట్
  • అరెస్ట్ వారెంట్‌ను గుర్తు చేస్తూ లేఖ
  • వారెంట్ ఏదని ప్రశ్నిస్తూ లేఖ రాసిన ఏపీ డీజీపీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు నాందేడ్ ఎస్పీ లేఖ రాశారు. మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అరెస్ట్ వారెంట్ జారీ అయిందని అందులో పేర్కొన్నారు. అయితే, ఈ లేఖతోపాటు ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ కాపీని జత చేయకపోవడాన్ని గమనించిన ఏపీ డీజీపీ కార్యాలయం తిరిగి లేఖ రాస్తూ.. ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ఏదని ప్రశ్నించింది.

బాబ్లీ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని ఆరోపిస్తూ, అప్పటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. చంద్రబాబు సహా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల నాటి ఈ కేసులో ధర్మాబాద్ కోర్టు తాజాగా చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

More Telugu News