pranay: ప్రణయ్ హత్య కేసులోని ఏడుగురు నిందితులు వీరే: నల్గొండ ఎస్పీ

  • ఆగస్ట్ 9 నుంచి రెక్కీ జరిగింది
  • ఆగస్ట్ 14న తొలి యత్నం
  • ఆగస్ట్ 22న ఇంటి వద్దే విఫలయత్నం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హత్యకు కోటి రూపాయలను డిమాండ్ చేసిన అస్గర్... చివరకు రూ. 50 లక్షలకు ఒప్పుకున్నాడని తెలిపారు.

 ఆగస్ట్ 9వ తేదీ నుంచి రెక్కీ జరిగిందని... మిర్యాలగూడలోని బ్యూటీ పార్లర్ వద్ద ఆగస్ట్ 14న ప్రణయ్ ని చంపేందుకు తొలి ప్రయత్నం చేశారని... ఆగస్ట్ 17న వెడ్డింగ్ రిసెప్షన్ ను టార్గెట్ చేశారని చెప్పారు. ఆగస్ట్ 22న ఇంటి వద్దే ప్రణయ్ ను హత్య చేసేందుకు విఫల యత్నం చేశారని తెలిపారు. చివరకు ఈ నెల 14న ప్రణయ్ ను హతమార్చారని చెప్పారు.

ఈ కేసులో ఏడుగురు నిందితులు వీరే... ఏ1 - మారుతీ రావు (అమృత తండ్రి), ఏ2 - సుభాష్ శర్మ (బీహార్), ఏ3 - అస్గర్ అలీ, ఏ4 - మహ్మద్ బారీ, ఏ5 - అబ్దుల్ కరీం, ఏ6 - శ్రవణ్ (బాబాయ్), ఏ7 - సముద్రాల శివగౌడ్ (డ్రైవర్).

More Telugu News