kishan reddy: కేటీఆర్, కిషన్ రెడ్డిల మధ్య ట్వీట్ల యుద్ధం

  • అమిత్ షా విమర్శలను తప్పుబట్టిన కేటీఆర్
  • ప్రజాస్వామ్యంలో మంచి ఎక్కడ కనిపించినా మెచ్చుకోవాలన్న కిషన్ రెడ్డి
  • మూసీ నది ప్రక్షాళన పనులు ఎక్కడి వరకు వచ్చాయంటూ సెటైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో, వివిధ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డిలు ట్విట్టర్ వేదికగా పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుంచి ఓ ప్రతినిధి బృందం తెలంగాణలో పర్యటించి, ఇక్కడి వ్యవసాయ ప్రగతి గురించి తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతుంటే... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం టీఆర్ఎస్ సర్కారును అదే పనిగా విమర్శించే పని పెట్టుకున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు.

కేటీఆర్ ట్వీట్ కు బీజేపీ నేత కిషన్ రెడ్డి అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడ మంచి కనిపించినా మెచ్చుకోవడం ఆరోగ్యకరమైన లక్షణమని... తెలంగాణ ప్రతినిధులు కూడా గుజరాత్ కు వెళ్లి సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిని అధ్యయనం చేసిన విషయాన్ని మరువరాదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇదే సమయంలో, హైదరాబాదులో మూసీ నది ప్రక్షాళన పనులు ఎక్కడ వరకు వచ్చాయంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

More Telugu News