mumbai: స్వతంత్ర భారత్‌ తొట్టతొలి మహిళా ఐఏఎస్‌ అధికారిణి కన్నుమూత

  • ముంబయిలోని తన స్వగృహంలో రాజమ్‌ మల్హోత్రా మృతి
  • సివిల్స్‌ 1951 బ్యాచ్ సభ్యురాలు 
  • కేరళలోని ఎర్నాకుళం జిల్లా స్వస్థలం

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో విజేతగా నిలిచి తొట్టతొలి ఐఏఎస్‌ ఆఫీసర్‌గా విధులు  నిర్వహించిన రాజమ్‌ మల్హోత్రా (91) కన్నుమూశారు. ముంబయిలోని తన స్వగృహంలో ఆమె మరణించారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన రాజమ్‌ 1951 సివిల్స్‌ బ్యాచ్‌ సభ్యురాలు. హోసూరు సబ్‌ కలెక్టర్‌గా తొలిసారి సేవలందించారు. ఐఏఎస్‌ అధికారిణిగా చెన్నైలో పనిచేసిన ఆమె అప్పటి సీఎం సి.రాజగోపాలచారి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. మొత్తం ఏడుగురు సీఎంల వద్ద పనిచేసిన అనుభవం ఆమెకుంది. 1985-90 మధ్య ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఆర్‌.ఎన్‌.మల్హోత్రా ఈమె భర్త. 

More Telugu News