japan: జపాన్‌కు వృద్ధుల సమస్య.. దేశంలో 35.6 మిలియన్ల మంది వృద్ధులే!

  • టెక్నాలజీ పరంగా ఇతర దేశాల కంటే ముందు
  • పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్య
  • కలవరపడుతున్న ప్రభుత్వం

టెక్నాలజీ పరంగా ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ముందుండే జపాన్‌ను ఇప్పుడో సమస్య వేధిస్తోంది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండడంతో ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. దేశ జనాభాలోని 20.7 శాతం మంది 70 ఏళ్లకు పైబడ్డ వారేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం!

65 ఏళ్లు అంతకంటే పైన వారు ఏకంగా 35.6 మిలియన్ల మంది ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచంలో ఇంత నిష్పత్తిలో మరే దేశంలోనూ వృద్ధులు లేరు. జపాన్ తర్వాత 23.3 శాతంతో ఇటలీ, 21.9 శాతంతో పోర్చుగల్, 21.7 శాతంతో జర్మనీ ఉన్నాయి. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, యువకుల సంఖ్య తగ్గిపోవడం వల్ల సమతౌల్యం లోపించే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం ఈ విషయంలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
 

More Telugu News