Rajeevgandhi murder: వాళ్లను వదిలి పెట్టకండి.. 'రాజీవ్‌' హత్య కేసు దోషుల విడుదలపై సుప్రీంలో బాధితుల పిల్లల పిటిషన్‌!

  • తమిళనాడు ప్రభుత్వం నిర్ణయంపై సుప్రీం కోర్టులో సవాలు
  • విచారణకు స్వీకరించిన కోర్టు
  • నాలుగు వారాల తర్వాత వాదనలు వింటామని స్పష్టీకరణ

1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ ఎన్నికల సభలో ప్రసంగించేందుకు వెళ్లి, ఎల్‌టీటీఈ మానవబాంబు దాడిలో దారుణ హత్యకు గురైన మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకేసులో దోషులైన వారిని విడిచి పెట్టవద్దంటూ బాధితుల పిల్లలు కోర్టును ఆశ్రయించారు.

ఏడుగురు దోషులను విడుదల చేయాలని ఇటీవల తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆనాటి దాడి ఘటనలో చనిపోయిన ఓ మహిళ కుమారుడు ఎన్‌.అబ్బాస్‌, మరో ముగ్గురు  సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం వీరి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంది. నాలుగు వారాల తర్వాత పిటిషన్‌పై విచారణ ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. కాగా పిటిషన్‌ దాఖలు చేసిన అబ్బాస్‌ (35) దాడి జరిగిన సమయానికి ఎనిమిదేళ్ల బాలుడు. 

More Telugu News