Teachers: అమరావతి అసెంబ్లీ చుట్టూ ఎన్నడూ లేనంత భారీ భద్రత!

  • చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఉపాధ్యాయ సంఘాలు
  • ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు
  • పలువురి అరెస్ట్

సీపీఎస్ రద్దుకు డిమాండ్ చేస్తూ, ఉపాధ్యాయ సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో, అమరావతిలోని అసెంబ్లీ, కృష్ణానది కరకట్ట, మంగళగిరి రహదారి, జాతీయ రహదారిపై ఎన్నడూ లేనంత భారీగా పోలీసులను మోహరించారు. ప్రకాశం బ్యారేజీ, కరకట్ట వారధి, మందడం తదితర ప్రాంతాల్లో కూడా మోహరించిన పోలీసులు, ఆ మార్గాల్లో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేస్తున్నారు.

 అసెంబ్లీ చుట్టూ పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి, ఆందోళనకారులు చొరబడకుండా గట్టి కాపలా ఏర్పాటు చేశారు. గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లోని పలువురు ఉపాధ్యాయులను ఇప్పటికే బైండోవర్ చేసి ఇల్లు కదలనివ్వని పోలీసులు, కళ్లుగప్పి ఉండవల్లి, సీతానగరం చేరుకున్న టీచర్లను అదుపులోకి తీసుకుని తాడేపల్లి, మంగళగిరి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి రహస్యంగా అసెంబ్లీ ముట్టడికి వచ్చిన సుమారు 400 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News