Rajeev Kanakala: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన యాంకర్ సుమ దంపతులు

  • కేరళ వరద బాధితులకు సాయం
  • ‘కున్నుమ్మ’లో ఆరోగ్య కేంద్ర నిర్మాణం
  • ఎంత ఖర్చయినా భరిస్తామన్న సుమ దంపతులు

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ యాంకర్ సుమ-నటుడు రాజీవ్ కనకాల దంపతులు ముందుకొచ్చారు. కేరళ వరదలపై వచ్చిన కథనాలను చూసి చలించిపోయిన సుమ దంపతులు అలిప్పి జిల్లాలోని కున్నుమ్మ ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన ఆరోగ్య సంక్షేమ కేంద్రాన్ని కూల్చేసి దాని స్థానంలో కొత్తది నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేరళ ఆరోగ్య మంత్రి థామస్ ఐజాక్‌తో మాట్లాడారు. తమ వంతు సాయంగా ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా సుమ-రాజీవ్ దంపతులు మాట్లాడుతూ.. తమకు తోచినంత సాయం చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. భవన నిర్మాణానికి ఎంత ఖర్చయినా భరిస్తామని తెలిపారు.

More Telugu News