Chandrababu: చంద్రబాబు వారెంట్ ను నిలిపివేసేలా చూడండి.. గవర్నర్‌కు టీడీపీ వినతి పత్రం!

  • కేంద్ర ప్రభుత్వం బాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది
  • కేసీఆర్, మోదీతో కలిసి బాబుపై అక్రమ కేసులు
  • నాటి కేసులు తెరపైకి రావడంలో బీజేపీ పాత్ర ఉంది

ఐక్యరాజ్య సమితిలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తే ఆయన ప్రతిష్ట పెరుగుతుందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీతో కలిసి బాబుపై కుట్రపన్ని అక్రమ కేసులు బనాయిస్తున్నారని రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేటి మధ్యాహ్నం టీడీపీ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసింది. చంద్రబాబుకు వచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించింది. అనంతరం మీడియాతో రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై అలాంటి కేసులు బనాయించడం అన్యాయమని, అప్పటి కేసులు ఇప్పుడు తెరపైకి రావడంలో బీజేపీ పాత్ర ఉందనుకుంటున్నట్టు తెలిపారు.  

More Telugu News