vijaya bank: ఒక్కటవుతున్న మూడు బ్యాంకులు.. ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న జైట్లీ!

  • విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్ ల విలీనం
  • ప్రకటన చేసిన ఆర్థిక శాఖ కార్యదర్శి
  • ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న అరుణ్ జైట్లీ

కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్ లను విలీనం చేయనున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజీవ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విలీనంతో దేశంలోనే మూడవ అతి పెద్ద బ్యాంకుగా ఇది అవతరించనుంది.

ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, బ్యాంకుల విలీనం కేంద్ర ప్రభుత్వ అజెండాలో ఉందనే విషయం బడ్జెట్ లోనే తాను ప్రకటించానని తెలిపారు. తొలి అడుగును ఇప్పుడు ప్రకటించామని... త్వరలోనే విధివిధాలను ప్రకటిస్తామని చెప్పారు. ఈ విలీనంతో మూడు బ్యాంకులకు చెందిన ఉద్యోగులెవరికీ ఇబ్బందులు ఉండవని... ఉత్తమ సర్వీసు నిబంధనలను అందరికీ అమలు చేస్తామని తెలిపారు.

More Telugu News