nithish kumar: జేడీయూ, బీజేపీ మధ్య లోక్ సభ సీట్ల చర్చలు సఫలం!

  • గత నెలలో సత్ఫలితాలనివ్వని చర్చలు
  • సీట్ల సర్దుబాటు విషయమై విమర్శలు చేసిన జేడీయూ
  • తాజాగా సంతృప్తికర ఒప్పందం జరిగిందన్న నితీశ్

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ సీట్ల పంపకం విషయమై బీజేపీ, జేడీయూ మధ్య జరుగుతున్న చర్చలు సంతృప్తికరంగా ముగిశాయి. గత నెలలో జరిగిన చర్చలు సత్ఫలితాలనివ్వలేదు. బీహార్‌లో ఉన్న మొత్తం 40 సీట్లలో 20 స్థానాల్లో తాము పోటీ చేస్తామని, మరో 20 స్థానాలను మిత్ర పక్షాలకు ఇస్తామని బీజేపీ గత నెలలో ప్రకటించింది.

ఇలా చేయడం వలన జేడీయూకి 12 సీట్లు, లోక్ జనశక్తి పార్టీకి 6, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి 2 సీట్లు చొప్పున పంపకం జరుగుతుంది. ఈ సీట్ల సర్దుబాటు విషయమై బీజేపీ మిత్రపక్షాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. జేడీయూ నేతలు కూడా ఈ సీట్ల పంపకంపై విమర్శలు చేశారు. తమకు 17, బీజేపీ 17 తీసుకోవాలని మిగిలినవి ఇతర మిత్రపక్షాలకు ఇవ్వాలని జేడీయూ చేసిన డిమాండ్‌తో మరోసారి చర్చలు అనివార్యమయ్యాయి.

ఈ సారి జరిగిన చర్చలు జేడీయూకి సంతృప్తిని కలిగించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై మీడియాతో మాట్లాడిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లోక్‌సభ సీట్ల విషయమై సంతృప్తికర ఒప్పందం జరిగిందని తెలిపారు.

More Telugu News