ram: ఆకట్టుకుంటోన్న 'హలో గురు ప్రేమకోసమే' రొమాంటిక్ టీజర్

  • రామ్ హీరోగా రొమాంటిక్ లవ్ స్టోరీ 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • ముఖ్యమైన పాత్రలో ప్రకాశ్ రాజ్

రామ్ .. అనుపమ పరమేశ్వరన్ జంటగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'హలో గురూ ప్రేమకోసమే' సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్లపై ఒక రొమాంటిక్ సీన్ ను టీజర్ గా కట్ చేశారు. ఇంతకుముందు కంటే రామ్ ఈ సినిమాలో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ కూడా మరింత గ్లామరస్ గా అనిపిస్తోంది.

ఈ సినిమాలో ప్రణీత .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న రామ్, ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో వున్నాడు. 

More Telugu News