KCR: మోదీ గారు.. దేవుడి దీవెనలతో మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా: కేసీఆర్

  • నేడు మోదీ 68వ పుట్టినరోజు
  • మోదీకి పలువురి నుంచి శుభాకాంక్షల వెల్లువ 
  • లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

నేడు ప్రధాని నరేంద్ర మోదీ 68వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజకీయ నేతలు, సినీ తారలు మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ కార్యాలయానికి ఓ లేఖ పంపారు. దేవుడి దీవెనలతో ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని.. మరిన్ని సంవత్సరాలు దేశానికి సేవ చేయాలని ప్రార్థించినట్లు కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.

More Telugu News