vijay devarakonda: 'నోటా' విడుదల మరింత ఆలస్యం?

  • తెలుగు .. తమిళ భాషల్లో 'నోటా'
  • పూర్తికాని పోస్ట్ ప్రొడక్షన్ పనులు 
  • దసరా కానుకగా విడుదల    

విజయ్ దేవరకొండ అభిమానులంతా కూడా 'నోటా' సినిమా విడుదల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ జోడీగా మెహ్రీన్ .. సంచనా నటరాజన్ నటించారు. తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన ఈ సినిమాను, వచ్చేనెల 4వ తేదీన విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడంలేదనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడమే అందుకు కారణమని అంటున్నారు. ఈ కారణంగా ఈ సినిమాను దసరా కానుకగా వచ్చేనెల 18వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా చెబుతున్నారు. దసరా రోజుల్లోనే 'అరవింద సమేత' .. 'హలోగురు ప్రేమకోసమే' .. 'పందెం కోడి' సినిమాలు వస్తున్నాయి. ఆ పోటీని 'నోటా' ఎంతవరకూ తట్టుకుంటుందో చూడాలి మరి.    

More Telugu News