venkatesh: విదేశాల్లో షూటింగు పూర్తిచేసిన 'ఎఫ్ 2' టీమ్

  • అనిల్ రావిపూడి దర్శకుడిగా 'ఎఫ్ 2'
  • కథానాయికలుగా తమన్నా .. మెహ్రీన్
  • కీలకమైన పాత్రలో రాజేంద్రప్రసాద్

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యువ దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా 'ఎఫ్ 2' రూపొందుతోంది. 'ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' అనేది ట్యాగ్ లైన్. ఈ మల్టీ స్టారర్ మూవీలో ఒక హీరోగా వెంకటేశ్ .. మరో హీరోగా వరుణ్ తేజ్ నటిస్తున్నారు. కథ ప్రకారం ఈ సినిమా షూటింగు కొంతకాలంగా విదేశాల్లో జరుగుతోంది.కొన్ని రోజులుగా 'ప్రగ్వే'లో జరుగుతోన్న షెడ్యూల్ తాజాగా ముగిసింది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా తెలియజేశాడు. లొకేషన్లో సరదాగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెంకీ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమాలో, రాజేంద్రప్రసాద్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. హ్యాట్రిక్ హిట్ తరువాత అనిల్ రావిపూడి చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే అందరిలోను అంచనాలు వున్నాయి.   

More Telugu News