ntr: 'అరవింద సమేత' ఆడియో రిలీజ్ కి ఏర్పాట్లు!

  • పాటల చిత్రీకరణలో 'అరవింద సమేత'
  • ఈ నెల 20వ తేదీన ఆడియో రిలీజ్
  • వచ్చేనెల 11వ తేదీన సినిమా విడుదల

త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ పనిలో వుంది. తమన్ స్వరపరిచిన పాటలను నాయకా నాయికలపై చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నాలుగే పాటలు వుంటాయని టాక్. రెండు పాటలు డ్యూయెట్స్ కాగా .. ఒకటి సోలో. మరో పాట బ్యాగ్రౌండ్ లో సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు ప్లే అవుతూ ఉంటుందని అంటున్నారు.

ఈ పాటలను ఈ నెల 20వ తేదీన నేరుగా మార్కెట్లోకి వదలనున్నట్టుగా తాజాగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించి రేపు మరో సర్ప్రైజ్ ఉండనుందంటూ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఒక డాక్యుమెంటరీ పనిపై విదేశాల నుంచి సీమకు వచ్చిన పూజా .. అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందనే ఉత్కంఠతో ఈ సినిమా కొనసాగుతుందట. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది    

More Telugu News