Tamilnadu: మరచిపోలేని బహుమతి.. కొత్త జంటకు 5 లీటర్ల పెట్రోల్ ఇచ్చిన స్నేహితులు!

  • తమిళనాడులోని కడలూరులో ఘటన
  • క్యాన్ లో పెట్రోల్ అందించిన స్నేహితులు
  • ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకేనని వెల్లడి

పెట్రోల్ ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకుని సామాన్యుడికి దడ పుట్టిస్తున్నాయి. దీంతో బయటకు వెళ్లడానికి బండి తీయాలంటేనే సామాన్యుడు సంకోచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తికి అతని స్నేహితులు విచిత్రమైన గిఫ్ట్ అందించారు. ఐదు లీటర్ల క్యాన్ నిండా పెట్రోల్ తీసుకెళ్లి కొత్త జంటకు అందించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది

కడలూరు జిల్లా కుమారచ్చి గ్రామానికి చెందిన  ఎలన్ చెజియన్, కనిమొళి ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు స్నేహితులు కలసి ఈ కొత్త జంటకు 5 లీటర్ల పెట్రోల్ ను ఓ క్యాన్ లో అందించారు. అక్కడితో ఆగకుండా క్యాన్ ను అందిస్తున్న ఫొటోలను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. భారీ పెట్రోల్ ధరలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే తాము ఈ పని చేసినట్లు డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడు, పెళ్లి కుమారుడి స్నేహితుడు ప్రభు తెలిపాడు. తామిచ్చిన బహుమతితో ఎలన్ దంపతులు సంతోషించారని తెలిపారు. 

More Telugu News