Petrol: నేడు కూడా పెరిగిన పెట్రోలు ధర... మరో ఆల్ టైమ్ రికార్డు!

  • 15 పైసలు పెరిగిన పెట్రోలు ధర
  • లీటరు డీజిల్ పై 6 పైసలు వడ్డన
  • ముడిచమురు ధరలు పెరుగుతున్నందునే
  • సుంకాలను తగ్గించాలని విపక్షాల డిమాండ్

ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డును చేరిన పెట్రోలు ధరలు, సోమవారం నాడు మరింతగా పెరిగాయి. నేడు లీటరు పెట్రోలుపై 15 పైసలు, లీటరు డీజిల్ పై 6 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో 'పెట్రో' ఉత్పత్తుల ధరల్లో మరో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 82.06కు, డీజిల్ ధర రూ. 73.78కి పెరిగాయి.

ఇదే సమయంలో ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 89.44కు డీజిల్ ధర రూ. 78.33కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నందునే దేశంలో ధరలను పెంచక తప్పడం లేదని చమురు కంపెనీలు చెబుతున్నాయి. ధరల పెంపు తమ చేతుల్లో లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వెంటనే సుంకాలను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

More Telugu News