giriraj: మరోసారి దేశ విభజనను చూడాల్సి రావచ్చు: బీజేపీ నేత గిరిరాజ్ సంచలన వ్యాఖ్యలు

  • 2047లో దేశ విభజనను చూడాల్సి రావచ్చు
  • విభజన శక్తుల జనాభా పెరుగుదల ప్రమాదకరం
  • జనాభా నియంత్రణకు కఠిన చట్టాలను తీసుకురావాలి

1947లో దేశ విభజన జరిగిన విధంగానే మరోసారి దేశం విడిపోయే అవకాశముందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2047లో ఈ విభజనను చూడాల్సి రావచ్చంటూ ఆయన ఆందోళనను వెలిబుచ్చారు. గత 72 ఏళ్లలో దేశ జనాభా 33 కోట్ల నుంచి 135.7 కోట్లకు చేరుకుందని... విభజన శక్తుల జనాభా పెరుగుదల చాలా ప్రమాదకరమని చెప్పారు. ప్రత్యేకంగా ఏ మతాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించకపోయినప్పటికీ... ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇప్పటికే 35-ఏ అధికరణ చర్చపై దుమారం రేగుతోందని గిరిరాజ్ అన్నారు. మునుముందు 'ఒకే భారత్' గురించి మాట్లాడటం కూడా సాధ్యం కాకపోవచ్చని ఆయన తెలిపారు. దేశంలో జనాభా విస్ఫోటనం ఆందోళనకరంగా ఉందని... జనాభా నియంత్రణపై రోడ్లపై నుంచి పార్లమెంటు వరకు చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. జనాభా నియంత్రణకు కఠినమైన చట్టాలను తీసుకురాకపోతే... దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.  

More Telugu News