maharshi: మహేష్ నటిస్తున్న 'మహర్షి' అమెరికా షెడ్యూలు రద్దు!

  • డెహ్రాడూన్ లో రెండు షెడ్యూల్స్ పూర్తి
  • అమెరికాలో 25 రోజుల షెడ్యూల్
  • కొన్ని కారణాల వల్ల యూఎస్ షెడ్యూల్ వాయిదా

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' అమెరికా షెడ్యూల్ వాయిదా పడినట్టు సమాచారం. కొన్ని కారణాల వల్ల అమెరికా ప్రయాణం రద్దైందని తెలుస్తోంది. దీంతో ఈ షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారంలో జరిగే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ ను డెహ్రాడూన్ లో ముగించుకుంది. 25 రోజుల షెడ్యూల్ కోసం అమెరికాకు వెళ్లాల్సిన తరుణంలో... వీరి ప్రయాణం రద్దైంది.

ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. మహేష్ బాబుకి ఇది 25వ చిత్రం కావడంతో... 'మహర్షి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది.

More Telugu News