USA: ఇష్టపడి అమెరికా అమ్మాయిని చేసుకున్నాడు.. గొడవ తలెత్తడంతో వదిలేశాడు!

  • ఇంట్లో గొడవలే కారణమన్న మహిళ
  • పోలీసులను ఆశ్రయించిన వైనం
  • లాయర్ ద్వారానే జవాబిస్తానన్న భర్త

బతుకుదెరువు కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడు అక్కడి యువతిని ఇష్టపడ్డాడు. చివరికి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి కూడా చేసుకున్నాడు. అనంతరం భారత్ కు ఈ జంట తిరిగివచ్చింది. అయితే ఓ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ రావడంతో ఆమెను వదిలేసిన భర్త మాయమైపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

కాంచీపురంలోని వెల్లాగేట్ సమీపంలో ఓ అమెరికన్ మహిళ(30) భాష రాక ఇబ్బంది పడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ..చెన్నైలోని వేళంచెర్రిలో తన భర్తతో కలసి నివాసం ఉన్నట్లు తెలిపింది.

ఇంట్లో తనతో వాగ్వాదం చెలరేగడంతో ఆగ్రహించిన భర్త.. కారులో బయటకు వెళ్లిపోయాడని పేర్కొంది. శుక్రవారం నుంచి ఇప్పటివరకూ ఇంటికి తిరిగిరాలేదని చెప్పింది. ఈ విషయమై అమెరికన్ మహిళ భర్తను ఓ మీడియా సంస్థ సంప్రదించగా.. తాను ఇంటికి రాననీ, ఏ జవాబు అయినా లాయర్ ద్వారానే ఇస్తానని స్పష్టం చేశాడు.

More Telugu News