imrankhan: పాకిస్థాన్‌ ఆర్థికంగా దివాళా తీసింది : ఇమ్రాన్‌ఖాన్‌

  • పాలనా వ్యవహారాలకు నిధుల కొరత
  •  రుణాల ఊబిలో దేశం
  •  గత ప్రభుత్వాల తప్పిదాలవల్లే ఈ దుస్థితి

పాకిస్థాన్‌ రుణాల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా దివాళా తీసిందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. పాలనాపరమైన అవసరాలకు సరిపడా ఆర్థిక వనరులు కూడా ప్రభుత్వం వద్ద లేవని చెప్పారు. గత ప్రభుత్వాలు పాలనాపరమైన తప్పిదాల వల్లే దేశం పూర్తిగా దివాళా తీసిందన్నారు. గత ప్రభుత్వాలు సంపద పెంపు అంశాలను పట్టించుకోకుండా ఆర్థిక నష్టాలు తెచ్చే ప్రాజెక్టులు చేపట్టిన పాపమిదని వ్యాఖ్యానించారు.

దేశ జనాభాలో యువత ఎక్కువని, వారికి ఉద్యోగాల కల్పన తన లక్ష్యమని అన్నారు. అలాగే దేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించడమే తన ముందున్న లక్ష్యమని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తే ఇది అసాధ్యం కాదని చెప్పారు. అవినీతి తగ్గితే అద్భుతాలు సృష్టించవచ్చునని, మనలో మార్పుకోసం భగవంతుడు ఈ పరీక్ష పెట్టాడని ప్రజలు భావించాలని ఇమ్రాన్‌ పిలుపునిచ్చారు. 

More Telugu News