BS Dhanova: నిద్రలేమితో పైలెట్లు ఒత్తిడి ఎదుర్కుంటున్నారు!: ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా

  • పైలెట్లు సామాజిక మాధ్యమాలకు బానిసలవుతున్నారు 
  • దీంతో నిద్రలేమికి గురవుతున్నారు 
  • 2013లో ఓ యుద్ధ విమానం కాలడానికి ఇదే కారణం  

భారత వాయు సేనాధిపతి మార్షల్ బీఎస్ ధనోవా సోషల్ మీడియా వ్యసనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్‌ఫోర్స్ పైలెట్లు సామాజిక మాధ్యమాలకు బానిసలవడం కారణంగానే విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 2013లో రాజస్థాన్‌లో ఓ యుద్ధ విమానం కూలిన ఘటనే దీనికి నిదర్శనమని ఆయన తెలిపారు.

పైలెట్లు మద్యం సేవించారో లేదో తెలుసుకునేందుకు శ్వాస పరీక్షలున్నట్టే.. నిద్రపోయారో లేదో కూడా తెలుసుకునేందుకు ఓ వ్యవస్థను తీసుకురావాలన్నారు. బెంగుళూరులో జరిగిన 57వ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు.

‘‘సామాజిక మాధ్యమాల విపరీత వినియోగం కారణంగానే పైలెట్లు రాత్రంతా నిద్ర పోవట్లేదు. చాలామంది పైలెట్ల పరిస్థితి ఇదే. దీంతో ఉదయాన్నే వారు అలసిపోయి కనిపిస్తున్నారు. ఉదయం 6 గంటలకే పైలెట్ల శిక్షణనిస్తాం. కానీ రాత్రంతా నిద్రలేక పైలెట్లు విమానం నడిపే సమయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీని ద్వారానే విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. 2013లో రాజస్థాన్‌లోని బర్మేర్ సమీపంలో యుద్ధ విమానం కూలిన ఘటనకు పైలెట్ నిద్రలేమే కారణం" అని చెప్పారు ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా 

More Telugu News