ntr: ఆకట్టుకుంటోన్న 'అరవింద సమేత' ఫస్టు లిరికల్ వీడియో సాంగ్

  • ఎన్టీఆర్ జోడీగా పూజా హెగ్డే 
  • ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుక 
  • దసరాకి సినిమా విడుదల 

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ముందుగా చెప్పినట్టుగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

'అనగనగనగా అరవిందట తన పేరు .. అందానికి సొంతూరు .. అందుకనే ఆ పొగరు, అరెరెరెరే .. అటు చూస్తే కుర్రాళ్లు .. అసలేమైపోతారు .. అన్యాయం కదా ఇది అనరే ఎవరూ .. ' అంటూ సీతారామ శాస్త్రి రాసిన ఈ లిరికల్ సాంగ్ కొనసాగుతుంది. తమన్ బాణీ .. అర్మాన్ మాలిక్ స్వరం కొత్తగా అనిపిస్తూ మనసుకు హత్తుకునేలా ఈ పాట వుంది. ఫస్టు సింగిల్ గా వచ్చిన ఈ లిరికల్ వీడియో .. సినిమాపై అంచనాలు పెంచడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుకను జరుపుకుని, దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News