balakrishna: హరికృష్ణ పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతోన్న కల్యాణ్ రామ్

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్'
  • ముఖ్య పాత్రలో రానా 
  • సంక్రాంతికి విడుదల

క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలకృష్ణ .. రానా కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

ఎల్లుండి నుంచి ఈ సినిమా షూటింగులో కల్యాణ్ రామ్ జాయిన్ కానున్నాడు. ఈ సినిమాలో హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ చేయనున్నాడనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఎన్టీ రామారావు రాజకీయ ప్రస్థానంలో హరికృష్ణ ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆ పాత్ర కోసమే కల్యాణ్ రామ్ ను ఎంపిక చేసుకున్నారు. ఎల్లుండి నుంచి బాలకృష్ణ .. కల్యాణ్ రామ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ 25 రోజుల కాల్షీట్స్ ఇచ్చాడట. ఎన్నో ప్రత్యేకతలు .. మరెన్నో విశేషాలు కలిగిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.  

More Telugu News