Telangana: తెలంగాణలో కేసీఆరే బాద్ షా.. 'ఇండియాటుడే' సర్వేలో వెల్లడి!

  • అన్నివర్గాలను ఆకట్టుకున్న టీఆర్ఎస్ అధినేత
  • ప్రతికూలత కేవలం 16 శాతమే
  • ఇబ్బందిపెడుతున్న నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలు

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు తిరుగులేదని ఇండియా టుడే -యాక్సిస్ మై ఇండియా సర్వేలో తేలింది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలంగాణలో 43 శాతం మంది చెప్పగా, కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి 18 శాతం మంది జై కొట్టారు. ఇక తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు మరో 15 శాతం మంది చెప్పారు. ముస్లింలు, గ్రామీణులు, ఎస్సీలు, రైతులు సహా అన్నివర్గాల నుంచి కేసీఆర్ కు మంచి మార్కులు పడ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 7,110 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేను రూపొందించారు. పారిశుద్ధ్యం, నిరుద్యోగం, వ్యవసాయ ఇబ్బందులు, నిత్యావసరాల ధరల పెరుగుదల తమ ప్రధాన సమస్యలని ప్రజలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు బాగుందని ఏకంగా 48 శాతం ప్రజలు తెలిపారు. బాగోలేదని కేవలం 16 శాతం మంది మాత్రమే వెల్లడించారు. తదుపరి ప్రధానిగా మోదీకి 44 శాతం మంది, రాహుల్ కు 39 శాతం మంది మద్దతు తెలిపారు. ఈ రేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేరిపోయారు. కేసీఆర్ దేశ ప్రధాని కావాలని దాదాపు 11 శాతం మంది ప్రజలు కోరుకోవడం గమనార్హం.

More Telugu News