ntr: 'అరవింద సమేత' నుంచి 'అనగనగా .. ' లిరికల్ వీడియో రిలీజ్ టైమ్

  • ఫ్యాక్షన్ నేపథ్యం లో ఫ్యామిలీ ఎంటర్టైనర్
  • తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
  • దసరా పండుగకి విడుదల

త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. ఫ్యాక్షన్ నేపథ్యంతో ముడిపడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఎన్టీఆర్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న ఈ సినిమా నుంచి, ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాకి తమన్ అందించిన స్వరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఈ రోజు సాయంత్రం విడుదల కానున్న లిరికల్ వీడియో, ఆ అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి. డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ కనిపించనున్న ఈ సినిమాను, దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు.   

More Telugu News