pslv c 42: రేపు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ 42 ఉపగ్రహ వాహకనౌక!

  • కక్ష్యలోకి చేరనున్న బ్రిటన్‌కు చెందిన రెండు శాటిలైట్లు
  • ఈరోజు మధ్యాహ్నం 1.07 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం
  • షార్‌ మొదటి వేదిక నుంచి ప్రయోగం

గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్‌వీ సీ42 ఉపగ్రహ వాహక నౌక రేపు నింగిలోకి దూసుకుపోనుంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలోని ఇస్రోకు చెందిన సతీష్‌థావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం రాత్రి 10.07 గంటలకు రాకేట్‌ దూసుకుపోనుంది.

షార్‌ కేంద్రంలోని బ్రహ్మప్రకాష్‌ హాల్‌లో మిషన్‌ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్‌)లో దీన్ని ప్రకటించారు. లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ ఎస్‌.పాండ్యన్‌ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 1.07గంటకు ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ ఆరంభమవుతుంది. ఈ ఉపగ్రహ వాహక నౌకద్వారా బ్రిటన్‌కు చెందిన 889 కిలో బరువున్న నోవాసార్‌, ఎస్‌1-4 అనే రెండు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.

More Telugu News