ramyakrishna: అందరూ నా పాత్ర గురించి మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది: రమ్యకృష్ణ

  • 'శైలజారెడ్డి' సినిమాలో నా పాత్రను మారుతి అద్భుతంగా మలిచారు
  • రెగ్యులర్ అత్త పాత్రలా ఉండదు
  • పుట్టినరోజు సందర్భంగా హిట్ కొట్టడం సంతోషంగా ఉంది

నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ కాంబినేషన్లో రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటించిన 'శైలజారెడ్డి' అల్లుడు చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమా విజయం పట్ల రమ్యకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రేపు రమ్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా ఒక సూపర్ హిట్ కొట్టడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఈ చిత్రం కోసం అందరూ చిత్తశుద్ధితో పని చేశారని రమ్యకృష్ణ తెలిపారు. ఈ సినిమాను చూసిన వారంతా తన పాత్ర గురించి మాట్లాడుతుండటం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. తన పాత్రను దర్శకుడు మారుతి అద్భుతంగా మలిచారని తెలిపారు. ఈ చిత్రంలో అత్త పాత్ర రెగ్యులర్ గా ఉండదని, ఎప్పుడూ చూసే అత్తాఅల్లుళ్ల మధ్య రొటీన్ కామెడీ ఉండదని చెప్పారు. ఈ సినిమా స్వీట్ సర్ ప్రైజ్ లా ఉంటుందని తెలిపారు.

More Telugu News