v hub: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాల లింకేజీ పత్రాలు అందజేసిన కేటీఆర్!

  • వి హబ్ ఆధ్వర్యంలో బ్యాంకు రుణ పత్రాల అందజేత
  • 16 స్టార్టప్ కంపెనీలకు బ్యాంకు రుణాలు
  • వి హబ్ బృందానికి అభినందనలు తెలిపిన కేటీఆర్

వి హబ్ ఆధ్వర్యంలో పలువురు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణ పత్రాలను మంత్రి కేటీఆర్ అందించారు. ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానంతరం బ్యాంకు అధికారులు, వి హబ్ ప్రతినిధుల సమక్షంలో ఈ బ్యాంకు రుణాల అందజేత కార్యక్రమం జరిగింది.

తమ వ్యాపారాల కోసం అవసరమైన నిధుల సమీకరణకు మహిళా పారిశ్రామికవేత్తల నుంచి వి హబ్ దరఖాస్తులను కోరింది. ఇందులో భాగంగా 245 మంది మహిళా పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు రాగా... అందులో సుమారు 16 స్టార్టప్ కంపెనీలను ఎంపిక చేసుకొని వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇతర బ్యాంకుల నుండి రుణ సౌకర్యాన్ని వీ హబ్ కల్పించింది.

వి హబ్ ప్రారంభమైన కొన్ని నెలల్లోనే మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహకారం అందించేలా చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల హబ్ బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. దీంతోపాటు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు అందుకున్న మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార ప్రణాళికల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు.

More Telugu News