arjun: ఆస్తులన్నీ అమ్మేసి ఆ సినిమా తీశాను: యాక్షన్ కింగ్ అర్జున్

  • ఒకానొక సమయంలో మార్కెట్ లేదు 
  • 'సేవగన్' సినిమా లైఫ్ ఇచ్చింది
  • ఎందుకు చేశానురా అనుకునే సినిమాలూ వున్నాయి

తెలుగు .. తమిళ భాషల్లో యాక్షన్ కథాంశాలను ఎక్కువగా ఎంచుకుంటూ, మాస్ యాక్షన్ హీరోగా అర్జున్ మంచి మార్కులు కొట్టేశాడు. ప్రేక్షకుల హృదయాలపై తనదైన మార్క్ వేసిన అర్జున్, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు.

" నేను చేసిన సినిమాల్లో నాకు ప్రత్యేకంగా అనిపించేది 'సేవగన్' అనే సినిమా. అసలు మార్కెట్ లేనప్పుడు నేనే దర్శక నిర్మాతగా 'సేవగన్' అనే సినిమా చేశాను. నా ఆస్తులన్నీ అమ్మేసి ఆ సినిమా చేశాను .. అది  నాకు లైఫ్ ఇచ్చింది. ఆ సినిమా తెలుగులో 'పోలీస్ రౌడీ' పేరుతో వచ్చింది. ఆ తరువాత నా కెరియర్లో నేను చేసిన సినిమాల్లో 'జై హింద్' .. 'జెంటిల్ మేన్' .. 'ఒకే ఒక్కడు' నాకు బాగా ఇష్టమైన సినిమాలు. ఇక ఎందుకురా ఈ సినిమా చేశాను అనుకునే సినిమాలు చాలానే వున్నాయి" అంటూ నవ్వేశారు.  

More Telugu News