BJP: నల్లధనానికి ఆయన స్నేహితుడు, పితామహుడు, ఫిలాసఫర్ కూడా.. చిదంబరంపై విరుచుకుపడిన బీజేపీ

  • నల్లధనానికి అన్నీ ఆయనే
  • కింగ్‌ఫిషర్‌తో యూపీఏ ప్రభుత్వం ‘స్వీట్ డీల్’
  • విరుచుకుపడిన సంబిత్ పాత్రా

కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరంపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది. నల్లధనానికి ఆయనను పితామహుడిగా అభివర్ణించింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ చిదంబరంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్లధనానికి ఆయన తత్త్వవేత్త  అని, పితామహుడు, స్నేహితుడు కూడా ఆయనేనని పేర్కొన్నారు. గత యూపీఏ ప్రభుత్వం కింగ్‌ఫిషర్‌తో ‘స్వీట్ డీల్’ కుదుర్చుకుందని ఆరోపించారు.

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు మధ్య ‘డీల్’ ఉందన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపణల నేపథ్యంలో ఆయనీ ఆరోపణలు చేయడం గమనార్హం. కాగా, తాను దేశం విడిచి వెళ్లేముందు అరుణ్ జైట్లీని కలిశానని మాల్యా స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. జైట్లీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ఉద్దేశంతో కాంగ్రెస్‌పై ఎటాక్ ప్రారంభించింది.

More Telugu News