nuziveedu: దొంగగా మారిన వైస్ ప్రిన్సిపాల్.. తొలిసారే పోలీసులకు దొరికిపోయిన వైనం!

  • కృష్ణా జిల్లా నూజివీడులో ఘటన
  • ఆర్థిక ఇబ్బందులతో రమేశ్ సతమతం
  • అరెస్ట్ చేసిన పోలీసులు

బాగా చదువుకున్న అతను కుటుంబ అవసరాల కోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. అనంతరం ఓ కాలేజీకి వైస్ ప్రిన్సిపాల్ గానూ మారాడు. ఎన్నిచేసినా కుటుంబ అవసరాలు తీరకపోవడం, ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో దొంగగా అవతారం ఎత్తాడు. తొలి ప్రయత్నంలోనే పోలీసులకు పట్టుబడిపోయి ఊచలు లెక్కిస్తున్నాడు.

కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన పసుపులేటి రమేశ్‌బాబు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. గతంలో సెక్యూరిటీ గార్డుగా, వైస్ ప్రిన్సిపాల్ గానూ రమేశ్ పనిచేశాడు. ఈ నేపథ్యంలో కష్టాలు తీరడానికి దొంగతనాలు చేయాలని అతను నిర్ణయించుకున్నారు. దీంతో నూజివీడులోని ‘టు లెట్’ బోర్డు ఉన్న ఇళ్లకు వెళ్లి అద్దెకు ఇల్లు కావాలని అడిగేవాడు. ఏ ఇంట్లో జనాలు తక్కువగా ఉన్నారో గమనించేవాడు. ఈ క్రమంలో ఇక్కడి ఎంప్లాయిస్ కాలనీలో ఓ మహిళ ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన రమేశ్.. అద్దెకు ఇల్లు కావాలని అడిగాడు. ఆమె ఇంటిని చూపించేందుకు లోనికి వెళ్లగా. వెనకే వెళ్లి తలుపు వేసేశాడు.

తాను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాననీ, వెంటనే ఇంట్లోని నగలన్నీ తీసి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి బాధితురాలు అంగీకరించకపోవడంతో ఆమెను తాడుతో కట్టేసి ఇంటిలోని నగదు, నగలతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. ఘటన జరిగిన 24 గంటలలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.

More Telugu News