Kaikala Satyanarayana: ‘దీర్ఘ ఆయుష్మాన్‌భవ’ ఫస్ట్ లుక్ విడుదల.. యముడిగా కైకాల పునరాగమనం!

  • మరోసారి యముడిగా కనిపించనున్న కైకాల సత్యనారాయణ
  • హీరో హీరోయిన్లుగా కార్తీక్ రాజు, మిస్తి చక్రవర్తి 
  • అక్టోబర్ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు 

యముడి పాత్ర అనగానే మనకు గుర్తొచ్చే నటుడు కైకాల సత్యనారాయణ. యమగోల, యమలీల వంటి చిత్రాల్లో ఆ పాత్రలో ఆయన అద్భుత నటనను కనబరిచారు. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ ఆ పాత్రలో అలరించనున్నారు. పూర్ణానంద్ దర్శకత్వంలో కార్తీక్ రాజు, మిస్తి చక్రవర్తి జంటగా రూపొందిన 'దీర్ఘ ఆయుష్మాన్‌భవ' చిత్రంలో కైకాల యముడిగా నటించారు.

వినాయకచవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణానంద్ మాట్లాడుతూ ‘‘చాలా రోజుల తర్వాత కైకాల మళ్లీ యముడిగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఆమని, పృధ్వీరాజ్, జెమినీ సురేష్ తదితరులు కీలకపాత్రలలో నటించారు.  

More Telugu News