Balakrishna: నందమూరి అభిమానులకు మరో సర్ ప్రైజ్.. బయోపిక్ నుంచి 'ఎన్టీఆర్, చంద్రబాబు' పోస్టర్ విడుదల!

  • చంద్రబాబు భుజంపై చేయివేసిన ఎన్టీఆర్
  • అంచనాలు పెంచేస్తున్న పోస్టర్
  • ఏఎన్నార్ పాత్రలో సుమంత్

ఇప్పటికే చంద్రబాబు ఫస్ట్ లుక్ తో అంచనాలను అమాంతం పెంచేసిన ‘ఎన్టీఆర్’ సినిమా బృందం తాజాగా అభిమానుల కోసం మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. వినాయక చవితి సందర్భంగా సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ ను ఈ రోజు విడుదల చేసింది. ఇందులో చంద్రబాబు భుజంపై చేయి వేసిన ఎన్టీఆర్.. ఏదో చెబుతున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ, ఆయన భార్య బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తున్నారు. చంద్రబాబు పాత్రను దగ్గుబాటి రానా పోషిస్తున్నారు. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్ నటిస్తున్నాడు. 2019, సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

More Telugu News