vahini: ‘వాహిని’ వల్లే ఎంతో మంది నటులు వచ్చారు!: రావి కొండలరావు

  • వాహిని లేకుంటే తెలుగుసినీ పరిశ్రమ వుండేది కాదు
  • సినిమాల్లో ఆరోగ్యకరమైన హాస్యం కొరవడుతోందని వ్యాఖ్య
  • ‘వాహిని’ చరిత్రపై ఈ రోజు పుస్తకావిష్కరణ

మద్రాస్ నగరంలో వాహిని స్టూడియో ఏర్పాటు చేయకుంటే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ ఉండేది కాదని ప్రముఖ నటుడు రావి కొండలరావు అభిప్రాయపడ్డారు. ఈ తరం వారికి వాహిని స్టూడియో గురించి అసలు తెలియదని వ్యాఖ్యానించారు. ఈ స్టూడియో ఆధారంగా ఎంతోమంది గొప్పగొప్ప నటులు తెలుగు సినీ పరిశ్రమకు లభించారని చెప్పారు. రాజమండ్రిలోని సీతం పేటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన హాస్యం కరవైపోయిందని కొండలరావు అన్నారు. వాహిని స్టూడియో గొప్పతనం, చరిత్ర, సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలతో ‘వాహిని’ అనే పుస్తకాన్ని తాను రాశానని తెలిపారు. కళాభారతి ఆడిటోరియంలో ఈ రోజు సాయంత్రం ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. తాను ఇప్పటివరకూ 600 సినిమాల్లో నటించానని కొండలరావు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఓ సినిమాలో నటిస్తున్నాననీ, మరో చిత్రం సెట్ పైకి వెళ్లాల్సి ఉందని చెప్పారు.

More Telugu News