New Delhi: టీమిండియా కెప్టెన్సీ ఎందుకు వదులుకున్నానంటే.. స్పందించిన ధోనీ!

  • భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ లో ఇబ్బంది పడ్డారు
  • తగినన్ని ప్రాక్టీస్ మ్యాచులు ఆడలేదు
  • ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మహి

మహేంద్రసింగ్ ధోనీ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్. భారత క్రికెట్ జట్టులోకి హెలికాప్టర్ షాట్ తో ఎంట్రీ ఇచ్చిన ధోని  జట్టును ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ సహా పలు ప్రతిష్టాత్మక టోర్నీల్లో విజేతగా నిలిపాడు. అయితే కెరీర్ ఉచ్ఛ స్థితిలో సాగుతున్న సమయంలో మహీ టెస్ట్, వన్డే, టీ20 ఫార్మెట్ కెప్టెన్ గా తప్పుకుని అభిమానులకు షాకిచ్చాడు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బయటపెట్టాడు.

2019లో జరిగే ప్రపంచకప్ కోసం తర్వాతి కెప్టెన్ కు మరింత సమయం ఇచ్చేందుకు వీలుగానే తాను రిటైర్మెంట్ ప్రకటించానని ధోని తెలిపాడు. జట్టు సంనద్ధత కోసం ఇది అవసరమని వ్యాఖ్యానించాడు. తాజాగా ఇంగ్లండ్ చేతిలో భారత్ పరాభావంపై స్పందిస్తూ.. ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచులు ఆడకపోవడమే భారత జట్టు ఓడిపోవడానికి  కారణమని మహి అన్నాడు. భారత ఆటగాళ్లు అక్కడి పిచ్ లపై ఆడటానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారని వెల్లడించాడు. చాలామంది భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ వాతావరణానికి అలవాటు పడలేకపోయారని వ్యాఖ్యానించాడు. 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోని.. 2016లో వన్డే, టీ20 జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలిగాడు.

More Telugu News