Donald Trump: అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ టీమ్ లో తొలి సిక్కు వ్యక్తి భాటియా!

  • ట్రంప్ సెక్యూరిటీలో ఎన్ఆర్ఐ అన్ష్ దీప్ సింగ్ భాటియా
  • గత వారం అతని నియామకం
  • పంజాబ్ లోని లూథియానాకు చెందిన వ్యక్తి భాటియా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీ టీమ్ లో చేరాలన్నది అన్ష్ దీప్ సింగ్ భాటియా చిరకాల కోరిక. చివరికి తాజాగా అతని కోరిక నేరవేరింది. అన్ష్ దీప్ సింగ్ ను అధ్యక్షుడి సెక్యూరిటీ టీమ్ లో గతవారం నియమించారు. దీంతో, ట్రంప్ సెక్యూరిటీలో స్థానం దక్కించుకున్న తొలి సిక్కు వ్యక్తిగా భాటియా రికార్డుల కెక్కడం విశేషం.

కాగా, భాటియా గురించి చెప్పాలంటే.. 1984లో సిక్కుల ఊచకోత సమయంలో భాటియా కుటుంబం యూపీలోని కాన్పూర్ నుంచి పంజాబ్ లోని లూథియానాకు వలస వెళ్లింది. నాటి దాడుల్లో భాటియా కుటుంబసభ్యులు కొందరు మరణించారు. అతని తండ్రి దేవేంద్ర సింగ్ కు ఈ దాడుల్లో బుల్లెట్ గాయాలయ్యాయి. ఆ తర్వాత లూథియానాకు వలస వెళ్లిన దేవేంద్ర సింగ్ అక్కడ ఫార్మాస్యూటికల్ రంగంలో వ్యాపారం చేశారు. అనంతరం, 2000 సంవత్సరంలో అమెరికాకు ఆ కుటుంబం వలస వెళ్లింది. అప్పుడు, భాటియా వయసు పదేళ్లు. 

More Telugu News