Telangana: తెలంగాణ అసెంబ్లీ రద్దుపై జోక్యం చేసుకోలేం.. పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

  • రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘన ఎలా జరిగిందో చూపాలి
  • లేనిపక్షంలో ఈ విషయంలో జోక్యం చేసుకోలేం
  • రాజ్యాంగం లేదా ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన ఎలా అవుతుందో చెప్పాలి?: హైకోర్టు

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ ఓ పిటిషన్ ను హైకోర్టులో ఇటీవల దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘన ఎలా జరిగిందో చూపకపోతే ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

కాగా, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా, అసెంబ్లీ రద్దు వ్యవహారం, రాజ్యాంగం లేదా ప్రజాప్రాతినిథ్య చట్టం ఉల్లంఘన ఎలా అవుతుందో చెప్పాలని హైకోర్టు అడిగింది. ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుపోతుందని హైకోర్టు చెప్పింది.

More Telugu News