Tech-News: వివో నుండి ఆకట్టుకునే ఫీచర్ లతో నూతన స్మార్ట్ ఫోన్ విడుదల!

  • 'వివో వై97' చైనాలో విడుదల 
  • ధర సుమారుగా రూ.21100
  • త్వరలో భారత మార్కెట్లోకి

వివో సంస్థ నుండి మరో స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. వివో వై97 పేరిట తాజాగా చైనాలో విడుదల అయిన ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. స్టారీ నైట్ బ్లాక్, డ్రీం పౌడర్ (పింక్), అరోరా బ్లూ కలర్ లలో లభించే ఈ ఫోన్ కి వెనక భాగంలో వర్టికల్ గా రెండు కెమెరాలని ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3డీ గ్లాస్, ఫేస్ అన్ లాక్  లాంటి పలు ఆకట్టుకునే ప్రత్యేకతలు ఉన్న ఈ ఫోన్ మన దేశంలో సుమారుగా రూ.21100 ధరకు లభ్యం కానుంది.

వివో వై97 ప్రత్యేకతలు:

  • ఫేస్ అన్‌లాక్, హీలియో పీ60 ఆక్టాకోర్ ప్రాసెసర్
  • వెనక భాగంలో రెండు 16/2 మెగాపిక్సల్ కెమెరాలు
  • ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే (1080 x 2280)
  • 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (256 జీబీ వరకు పెంచుకోవచ్చు)
  • 3315ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News