నిధులు ఇవ్వకుండా పోలవరం నిర్మించమంటే ఎలా?: అయ్యన్నపాత్రుడు

- కేంద్రం నిధులివ్వడం లేదని మండిపాటు
- బీజేపీ నేతలు గతంలో ఇదే ప్రాజెక్టులను పొగిడారని వ్యాఖ్య
- టీవీ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి
అసలు కేంద్రం నిధులు విడుదల చేయకుంటే ప్రాజెక్టులను ఎలా నిర్మిస్తామని అయ్యన్న ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజల జీవనాడి అనీ, దాని కారణంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఏపీ ప్రభుత్వం పోలవరంలో గ్యాలరీ వాక్ ను ప్రారంభించనుందని మంత్రి చెప్పారు. గ్యాలరీ వాక్ ప్రారంభం కావడం అంటే ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దగ్గరగా వచ్చేయడమేనని తెలిపారు. ప్రభుత్వంలో కలసి ఉన్నప్పుడు బీజేపీ నేతలు పోలవరం, పట్టీసీమ ప్రాజెక్టులను పొగిడారనీ, ఇప్పుడేమో విమర్శలకు దిగుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.