mamatha: పెట్రోల్, డీజిల్ ధరలను రూపాయి మేర తగ్గించిన మమతా బెనర్జీ!

  • పెట్రోల్, డీజిల్ ధరలపై వెల్లువెత్తుతున్న నిరసనలు
  • నిన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ బంద్ 
  • మమతా బెనర్జీ కీలక నిర్ణయం

ఇటీవలి కాలంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరల తీరుకు వ్యతిరేకంగా సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 21 విపక్ష పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చి తమ నిరసన వ్యక్తం చేశాయి. అయినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో పెట్రోల్ ధరల భారాన్ని మోసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 మేర అదనపు వ్యాట్‌ను తగ్గించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో, తాజాగా మమతా బెనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రూ.1 చొప్పున తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. మరోపక్క, ఈ ఏడాది చివర్లో ఉన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, బీజేపీ పాలిత రాజస్థాన్ రాష్ట్రం కూడా పెట్రోల్, డీజిల్ లపై లీటరుకు రూ.2.5 చొప్పున ధర తగ్గిస్తున్నట్టు సమాచారం.

More Telugu News