gannavaram: వచ్చే నెలలో గన్నవరం నుంచి తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు

  • సింగపూర్ కు అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించనున్న ఇండిగో
  • అక్టోబర్ 2న తొలి సర్వీసుకు ముహూర్తం
  • త్వరలోనే టికెట్ల అమ్మకాల ప్రారంభం

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల తొలి వారంలో విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్ కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభంకానుంది. ఇండిగో సంస్థ ఈ సర్వీసును నడపనుంది. ఏపీ ప్రభుత్వం, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో చేసుకున్న ఒప్పందం మేరకు అక్టోబర్ 2న సర్వీసును ప్రారంభించడానికి ఇండిగో ముహూర్తం ఖరారు చేసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. అనంతరం టికెట్ల అమ్మకాలు ప్రారంభమవుతాయి.

విమానాశ్రయంలోని పాత టెర్మినల్ ను అంతర్జాతీయ సర్వీసులకు వినియోగించనున్నారు. విమానాశ్రయంలో ప్రస్తుతమున్న 7,500 అడుగుల రన్ వేను 11,023 అడుగులకు విస్తరించనున్నారు. మరోవైపు రూ. 611 కోట్లతో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నారు. రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

More Telugu News