Hyderabad: పాతబస్తీలో దూకుడు మీదున్న ‘గాలిపటం’.. తొలి జాబితాను ప్రకటించిన ఎంఐఎం!

  • ఏడుగురు అభ్యర్థులతో తొలిజాబితా
  • 2014లో ఏడు సీట్లు గెలుచుకున్న ఎంఐఎం
  • మళ్లీ గెలుపు గుర్రాలకే ఛాన్స్ ఇచ్చిన ఒవైసీ

పాత బస్తీలో తన పట్టును ఈ సారి కూడా నిలుపుకునేందుకు ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)  పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏడుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. వీరిలో చాంద్రాయణగుట్ట నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, యాకుత్ పురలో అహ్మద్ పాషా ఖాద్రీ పార్టీ టికెట్ పై పోటీ చేయనున్నారు.

వీరితో పాటు ముంతాజ్ అహ్మద్ ఖాన్(చార్మినార్), మహ్మద్ మౌజమ్ ఖాన్(బహదూర్ పుర), అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల(మలక్ పేట), జాఫర్ హుస్సేన్ మిర్జా(నాంపల్లి), కౌసర్ మొహీనుద్దీన్(కార్వాన్)లకు పార్టీ అధిష్ఠానం టికెట్లను కేటాయించింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం తరఫున ఏడుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. తాజాగా ఈ గెలుపు గుర్రాలకే పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ టికెట్లను కట్టబెట్టారు. ఎంఐఎంకు తెలంగాణలో ఎన్నికల సంఘం గాలిపటం గుర్తును కేటాయించింది.

More Telugu News