Telangana: ఆ నాలుగు రాష్ట్రాలతోపాటే తెలంగాణ ఎన్నికలు కూడా!: ఎన్నికల సంఘం యోచన

  • ముందు, వెనకకు జరపకూడదని నిర్ణయం
  • వాటితోపాటు ఎన్నికల షెడ్యూల్
  • ఫలితాలు కూడా ఒకేసారి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయాన్ని ఎన్నికల సంఘం అధికారులు చూచాయగా వెల్లడించారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలతోపాటే తెలంగాణ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఈసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పైన చెప్పిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తే, ఆ ప్రభావం తెలంగాణ ఎన్నికలపై పడుతుందని అధికారులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. కాబట్టి ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటే తెలంగాణలోనూ నిర్వహించాలని యోచిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికలను ముందుకు జరపడమో, వెనక్కి జరపడమో చెయ్యడం వల్ల పెద్దగా ఒనగూరే ప్రయోజనం కూడా ఉండదని ఈసీ భావిస్తోంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలుతోపాటు తెలంగాణలోనూ ఎన్నికల షెడ్యూలును విడుదల చేయాలని ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అలాగే, ఫలితాలను కూడా ఒకేసారి విడుదల చేయాలని ఈసీ యోచిస్తోంది. ఈసీ విధానం ఇదేనని ఎన్నికల వర్గాలు పేర్కొన్నాయి.

More Telugu News