Chandrababu: నా సతీమణి నారా భువనేశ్వరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు: చంద్రబాబునాయుడు

  • ప్రజా పాలనలో ఉండే నాకు అనునిత్యం తోడు ఆమె
  • కుటుంబానికి అన్నీ తానై నా సతీమణి నడిపిస్తుంది
  •  ఓ ట్వీట్ లో విషెస్ చెప్పిన చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతుల పెళ్లి రోజు నేడు. ఈ సందర్భంగా చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరికి శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు.

‘ప్రజా పాలనలో తలమునకలై ఉండే నాకు అనునిత్యం తోడై ఉండి, కుటుంబానికి అన్నీ తానై నడిపించే నా సతీమణి నారా భువనేశ్వరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోలో చంద్రబాబు, భువనేశ్వరి నవ్వుతూ ఉండగా, మనవడు దేవాన్ష్ చంద్రబాబు ఒళ్లో కూర్చుని ఉండటం కూడా ఈ ఫొటోలో గమనించవచ్చు.

More Telugu News