somu veeraj: రాజధాని పేరిట టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు: సోము వీర్రాజు ఆరోపణ

  • ఎన్డీఏ నుంచి విడిపోయాక మోదీపై టీడీపీ విమర్శలు
  • రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.1500 కోట్లిచ్చింది
  • వర్షమొస్తే కారిపోయే తాత్కాలిక భవనాలు నిర్మిస్తారా?  

ఏపీ టీడీపీ నేతలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు ఆరోపణలు గుప్పించారు. శాసనమండలిలో రాజధాని అమరావతిపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీపై టీడీపీ నేతలు విమర్శలు చేయడాన్ని సోము వీర్రాజు నిరసించారు. శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోము వీర్రాజు మాట్లాడుతూ, బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నప్పుడు పొగుడుతూ తీర్మానాలు చేశారని, ఎన్డీఏ నుంచి ఆ పార్టీ విడిపోయాక మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, రాజధాని నిర్మాణం నిమిత్తం కేంద్రం పదిహేను వందల కోట్ల రూపాయలు ఇస్తే, వర్షమొస్తే కారిపోయే తాత్కాలిక భవనాలను కట్టారని ఆరోపించారు.

More Telugu News