motorola: 6 జీబీ ర్యామ్ తో 'మోటోరోలా జీ6 ప్లస్' స్మార్ట్ ఫోన్ విడుదల!

  • అమెజాన్‌, మోటో హబ్ స్టోర్లలో లభ్యం
  • ధర రూ.22,499
  • ఫోన్ కొనాలనుకునే వారికి పలు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు 

గత ఏప్రిల్‌లో బ్రెజిల్‌లో విడుదలైన 'మోటోరోలా జీ6 ప్లస్' తాజాగా నేడు భారత మార్కెట్లోకి వచ్చేసింది. పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లతో వచ్చిన ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, డ్యూయల్ కెమెరాలని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ కొనాలనుకునే వినియోగదారుల కోసం పలు ఆఫర్లు కూడా ఉన్నాయి. పేటీఎం మాల్ యాప్‌ను ఉపయోగించి కొనుగోలు చేస్తే మూడు వేల క్యాష్‌బ్యాక్, అలాగే జియో కస్టమర్లు అయితే రూ.2200 విలువైన క్యాష్‌బ్యాక్ వోచర్లని పొందుతారు. ఇండిగో బ్లాక్ రంగులో లభించే ఈ ఫోన్ ఈరోజు నుండే అమెజాన్‌, మోటోహబ్ స్టోర్లలో లభించనుంది. దీని ధర రూ.22499గా ఉంది.

'మోటోరోలా జీ6 ప్లస్'   ప్రత్యేకతలు:

  • 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం)
  • 5.93" డిస్‌ప్లే(1080x2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • వెనక భాగంలో 12/5 మెగాపిక్సల్ కెమెరాలు
  • ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఆక్టాకోర్ 630 ప్రాసెస‌ర్‌
  • 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News